ఈరోజు రాలేదా సూరీడు ఠీవిగా తూరుపుదిక్కంతా ధారాధరాలేనా |
|||||
జడివానా కురిసేనా తడిసేనా ఈనేలా ఉడికించే సూరీడు విడిచేనా ఉగ్రతను |
|||||
తగుమాత్రంగా ఎండ తగుమాత్రంగా వాన అగణితమా సౌభాగ్యం జగమంతా సంతోషం |
|||||
చల్లని తొలిసంజ చల్లని మలిసంజ చల్లని వెన్నెలలు కొల్లలైతే చాలు |