కనుల జూద మనుకొందును కనులు చాల వనుకొందును మనసు పట్టలేని నిన్ను కనులు పట్ట లేవందును |
|
భావనలో పట్టరాని పావన మగు భవ్యమూర్తి ఆ విధమని ఈ విధమని నీ వైభవ మెన్ని నేను |
॥కనుల॥ |
ఓహోహో నీవే నా ఊహల నడపించు శక్తి ఊహింపగరాని నిన్ను ఊహించును భక్తి కాన |
॥కనుల॥ |
ఏమో పరమేశుడవో రాముడవో కృష్ణుడవో నా మనసున నిలచితివే నీ మూర్తిని మనసారా |
॥కనుల॥ |