నీ విచ్చిన యూపిరితో నిలచితి నేను నావాడ వని నిన్ను నమ్మితి నేను |
|||
నా వెన్ను గాచి రామనారాయణా నీవు నావాడవై యుండ నాకేమి కొఱత భావింప మనమధ్య బంధ మింతటిదై యేవేళ తెగకుండ నెసగనీ ధృఢమై |
నీ విచ్చిన | ||
జగములం దేమూలల జన్మించితి గాక యుగయుగంబుల నుండి తగిలియుంటి నిన్ను అగచాట్లపాలైన యన్ని వేళల యందు తగినరీతిని నాదు తలగాచి నావు |
నీ విచ్చిన | ||
పరమయోగులు కూడ పట్టలేని నిన్ను పరమమూఢుడ నెట్లు భావింతు నయ్య అరయ నిర్వ్యాజకరుణాంతరంగుడ నిన్ను తరచు కూరిమి మీఱ తలచుచుండెద గాక |
నీ విచ్చిన |
||