గ్రంథసంచయమున గల సద్విషయముల చదివి నేర్చెడు నంత చదువు లేదు చదువ జాలిన యంత జదివి నేర్చిన దైన మనసున నాటెడు మాట లేదు మనసుకు నచ్చిన మంచి మాటల నైన క్రియలోన జూపు నిర్ణయము లేదు నిర్ణయించుచు నుండు నీ రీతి యీ లోక నీతి నిత్యంబును నిశ్చయముగ గాలి కటు నిటు నెగిరెడు ధూళికణము వోలె తిరిగెడు వాడవై నేల మీద నెంత కాలంబు గడపిన నేమి ఫలము జరిగినది చాలు నిజతత్త్వ మెఱిగి కొనుము |
||