17, ఆగస్టు 2013, శనివారం

మన పాహి రామప్రభో శీర్షికలో ఇప్పటికి 200 పద్యాలు సంపన్నం అయ్యాయి.

పాఠకమహాశయులారా,  
రామభక్తవరేణ్యులారా!

ఈ శీర్షికలో నేడు ప్రకటించిన పద్యంతో మన చేస్తున్న శ్రీరామచంద్రులవారి మానసిక పూజ సర్వవిధాలా  సంపన్నం అయింది.

త్వరలోనే ఈ మానసిక పూజా విధానం మొత్తం ఒకే టపాలో విడిగా ప్రకటించటానికి ప్రయత్నిస్తాను.

నిజానికి, ఈ పూజావిధానాన్ని చదువుతున్న వాళ్ళ సంఖ్య చాలా స్వల్పం. అసలు ఈ‌ పాహి రామప్రభో శీర్షికకు లభిస్తున్న ఆదరం కూడా బహుస్వల్పమే ననుకోండి.  అది కొంచెం నిరుత్సాహం కలిగించే విషయం!

ఇప్పటితో ఈ శీర్షికలో 200 పద్యాలు పూర్తయ్యాయి.

ఈ పూజావిధానంలో కొన్ని కొన్ని అదనపు ఉపచారాలను షోడషోపచారాల తరువాత చేర్చటం‌ జరిగింది.  వాటికి సంబంధించిన పద్యాలను తగిన స్థానాల్లో ఉంచాలంటే పద్యాల అనుక్రమణిక (వరస) మార్చవలసి ఉంటుంది.  ఈ‌ విషయం పాఠకులు గమనించ గలరు. 

ఈ 'పాహి రామప్రభో' శీర్షిక శ్రీరామచంద్రులవారి అనుగ్రహం కోసం వ్రాయబడుతున్నది.

ముఖ్యంగా, ఇది నా కోసం నేను స్వామివారి నుద్దేశించి వ్రాసుకుంటున్నది.

ఇకముందు కూడా, ఈ శీర్షిక కొనసాగుతుంది.

ఎన్నాళ్ళిలా ఈ‌"పాహి రామప్రభో" శీర్షిక కొనసాగుతుందీ అన్నది నా చేతిలో ఉన్న నిర్ణయం కాదని అందరికీ సవినయంగా మనవి చేసుకుంటున్నాను.