5, ఆగస్టు 2013, సోమవారం

పాహి రామప్రభో - 191

శ్రీరామచంద్రులవారికి పుష్పార్చన అనంతరం ఆఘ్రాణించటానికి ధూపం సమర్పించాలి. అంటే స్వామివారు విదిది చేసిన ప్రదేసం అంతా సుగంధసుపరీమళం అలముకునేలా చేయటం‌ అన్నమాట ఈ‌ ఉపచారం.


ధూపం
కం. పంచప్రాణంబులతో
నంచితమగు ధూపమిచ్చు టత్యుచితమౌ
నంచు తలంచితి నిచ్చితి
నించుక దయచూపి యేలవే రఘురామా


తాత్పర్యం. నీకు ఎటువంటి ధూపం ఇచ్చేదీ? నా పంచప్రాణవాయువులూ నీ‌భక్తిపరీమళంతో నిండిపోయి ఉన్నాయి. అందుచేత వాటితోటే నీకు ధూపం సమర్పించటం అత్యంత ఉచితంగా ఉంటుందని భావిస్తున్నాను. అందుచేత నా భక్తిపరీమళపూరితమైన ఈ‌ ధూప సుగంధాన్ని ఆఘ్రాణించి నా మీద అనుగ్రహం చూపవలసింది.


(ఆగష్టు 2013)